డిజిటలీకరణలో కర్ణాటక రాజధాని బెంగళూరు దూసుకెళుతోంది. 'అత్యధిక డిజిటలీకరణ నగరాలు' జాబితాలో తొలిస్థానాన్ని ఆక్రమించింది. దేశంలోనే అత్యధికంగా కార్డుల ద్వారా చెల్లింపులు జరుగుతున్నట్లు పేమెంట్ సొల్యూషన్ సంస్థ రాజోర్ పే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
రాజోర్ పే సాఫ్ట్వేర్ సంస్థ విడుదల చేసిన 'ఎరా ఆఫ్ రైసింగ్ ఫిన్టెక్ రిపోర్ట్' ప్రకారం బెంగళూరు తరువాత రెండోస్థానంలో హైదరాబాద్, మూడు, నాలుగు, ఐదులో ముంబయి, పుణె, దిల్లీ ఉన్నాయి.
రాష్ట్రాల్లో..
రాష్ట్రాల జాబితాలో తొలి ఐదు స్థానాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, దిల్లీ ఉన్నాయి.