తెలంగాణ

telangana

ETV Bharat / business

400 జిల్లాల్లో బ్యాంకుల రుణమేళాలు: ఆర్థిక మంత్రి

మాంద్యానికి అడ్డుకట్ట వేసే దిశగా బ్యాంకర్లతో సమావేశమైన కేంద్ర ఆర్థిక మంత్రి కీలక నిర్ణయాలు ప్రకటించారు. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్​బీఎఫ్​సీ)లతో ప్రభుత్వ రంగ బ్యాంకులు.. వారి జిల్లాల్లో సమావేశమవుతాయని తెలిపారు.

By

Published : Sep 19, 2019, 10:37 PM IST

Updated : Oct 1, 2019, 6:39 AM IST

400 జిల్లాల్లో రుణదాతలతో బ్యాంకుల భేటీ

దేశంలోని 400 జిల్లాల్లో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ(ఎన్​బీఎఫ్​సీ)లతో ప్రభుత్వ రంగ బ్యాంకులు సమావేశమవుతాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించారు. ఆర్థిక మాంద్యాన్ని నిరోధించేందుకు గురువారం ప్రభుత్వ రంగ బ్యాంకుల అధినేతలతో సమావేశమైన కేంద్ర మంత్రి.. కీలక నిర్ణయాలను ప్రకటించారు. రుణాలు ఇచ్చేందుకు ఎన్​బీఎఫ్​సీల వద్ద ద్రవ్యలభ్యత ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ సమావేశాలు రెండు దశల్లో జరుగుతాయని నిర్మలా పేర్కొన్నారు. సెప్టెంబరు 24 నుంచి 29 మధ్య 200 జిల్లాలు.. అక్టోబర్​ 10 నుంచి 15 మధ్యలో మిగిలిన జిల్లాల్లో సమావేశాలను నిర్వహిస్తామన్నారు.

ఇదీ చూడండి:-ఆన్​లైన్ ఆఫర్ల వలలో పడితే.. తప్పదు భారీ మూల్యం

Last Updated : Oct 1, 2019, 6:39 AM IST

ABOUT THE AUTHOR

...view details