Bank Strike News: బ్యాంకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) గురువారం సమ్మె చేపట్టింది. తొమ్మిది యూనియన్లతో కూడిన ఈ ఫోరం ఈనెల 16, 17 తేదీల్లో రెండు రోజుల పాటు స్ట్రైక్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించింది. ఈ సమ్మెలో దేశవ్యాప్తంగా 9 లక్షల మంది ఉద్యోగులు పాల్గొంటున్నారని యూనియన్లు వెల్లడించాయి.
ఈ సమ్మె దేశవ్యాప్తంగా లక్ష బ్రాంచ్లపైన ప్రభావం చూపిస్తుందన్నారు ఆల్ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కన్ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి సౌమ్యా దత్తా. క్యాష్ విత్డ్రా, డిపాజిట్లు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్, లోన్ ప్రాసెస్, చెక్ క్లియరింగ్, అకౌంట్ ఓపెనింగ్ వంటి కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పారు.
- మహారాష్ట్రాలో 60వేల మంది బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ముంబయిలోని ఆజాద్ మైదాన్ వద్ద 5000వేల మందితో నిరసన నిర్వహిస్తామన్నాయి యూనియన్లు.
- రాజస్థాన్లో 4వేలకుపైగా బ్రాంచీలకు చెందిన 25వేల మంది ఉద్యోగులు నిరసనలో పాల్గొంటున్నారని యునైటెడ్ ఫారమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రతినిధి మహేశ్ మిశ్ర వెల్లడించారు. 6,650 ఏటీఎంలలో డబ్బులు అందుబాటులో ఉండకపోవడం సహా ఈ స్ట్రైక్ రూ.10వేల కోట్ల లావాదేవీలపై ప్రభావం చూపిస్తుందన్నారు.
- కర్ణాటక రాజధాని బెంగళూరులోని మైసూర్ బ్యాంక్ సర్కిల్ వద్ద నిరసనకు దిగారు బ్యాంకు ఉద్యోగులు. ప్రైవేటీకరణపై ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.