తెలంగాణ

telangana

ETV Bharat / business

Bank Holidays: నవంబర్‌లో బ్యాంకులకు 17 రోజుల సెలవు.. నిజమెంత? - బ్యాంకులకు సెలవులు

నవంబర్​లో (Bank holidays in November) ఏకంగా 17 రోజులపాటు బ్యాంకులు పనిచేయవనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. అందులో నిజమెంత?

Bank holidays November
బ్యాంకు సెలవులు

By

Published : Oct 26, 2021, 4:52 AM IST

నవంబర్‌లో బ్యాంకులకు (Bank holidays in November) వరుస సెలవులు రానున్నాయి. ఆర్‌బీఐ ప్రకటించిన జాబితా ప్రకారం ముఖ్యమైన పండుగలు, సాధారణ సెలవులు కలుపుకొని మొత్తం 17 రోజులు బ్యాంకులు పనిచేయవు. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్న విషయం ఇదీ. అయ్యో! వచ్చే నెలలో చాలా బ్యాంకు పనులు పెట్టుకున్నానే!.. ఇన్ని సెలవులా అని కంగారు పడొద్దు. ఎందుకంటే ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. రాష్ట్రాలను బట్టీ మారుతూ ఉంటాయి. కన్నడ రాజ్యజోత్సవం, ఛత్‌ పూజా వంటి స్థానిక పండుగ రోజుల్లో ఆయా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. ఆ విధంగా బ్యాంకులకు నవంబర్‌లో 17 సెలవులు ఉండనున్నాయి. కానీ సామాజిక మాధ్యమాల్లో ఏకంగా 17 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవన్న ప్రచారం జరుగుతోంది. దీంట్లో ఎలాంటి నిజం లేదు.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే దీపావళి, గురునానక్‌ జయంతి/ కార్తిక పూర్ణిమ సందర్భంగా (Bank holidays November 2021) రెండు రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. సాధారణ సెలవులు (శని, ఆదివారాలు)తో కలుపుకొని మొత్తంగా 8 రోజుల పాటు బ్యాంకులు పనిచేయవు. కాబట్టి ఆయా తేదీలను బట్టి మీ బ్యాంక్‌ పనులను షెడ్యూల్‌ చేసుకోండి..

తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులివే..

  • నవంబర్‌ 4 - దీపావళి (గురువారం)
  • నవంబర్‌ 7 - (ఆదివారం)
  • నవంబర్‌ 13 - (రెండో శనివారం)
  • నవంబర్‌ 14 - (ఆదివారం)
  • నవంబర్‌ 19 - గురునానక్‌ జయంతి/కార్తిక పూర్ణిమ (శుక్రవారం)
  • నవంబర్‌ 21 - (ఆదివారం)
  • నవంబర్‌ 27 - (నాలుగో శనివారం)
  • నవంబర్‌ 28 - (ఆదివారం)

ఇదీ చూడండి:మాస్క్​ పెట్టుకోమన్నారని.. బ్యాంకు సిబ్బందికి చుక్కలు!

ABOUT THE AUTHOR

...view details