తెలంగాణ

telangana

ETV Bharat / business

బ్యాంక్ X పోస్ట్​ ఆఫీస్.. ఫిక్స్​డ్ డిపాజిట్​కు ఏది బెస్ట్? - బ్యాంకులు పోస్ట్ ఆఫీస్​లు వడ్డీ రేట్లు

రిస్క్​లేని పెట్టుబడి సాధనాలు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఫిక్స్​డ్​ డిపాజిట్​. బ్యాంకులే కాదు.. పోస్టాఫీస్​లో కూడా ఎఫ్​డీ చేసుకునేందుకు వీలుంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్​బీఐ, పోస్టాఫీస్ ఎఫ్​డీ.. వేటికి వడ్డీ రేట్లు అధికం? (Bank FD vs post office FD) ఎందులో ఎలాంటి ఆఫర్లు ఉన్నాయి? అనే వివరాలు మీ కోసం.

FD VS PO DEPOSITS
బ్యాంకులు, పోస్ట్ ఆఫీస్ వడ్డీ రేట్లు

By

Published : Sep 26, 2021, 6:07 PM IST

ఫిక్స్​డ్​ డిపాజిట్లు.. రిస్క్​లేని, కచ్చితమైన ఆదాయాన్నిచ్చే పెట్టుబడి సాధనాలు. సాధారణంగా అన్ని బ్యాంకులు ఈ సదుపాయం కల్పిస్తాయి. అత్యవసరాలకు డబ్బు కావాల్సి వస్తే.. ఎఫ్​డీ చేసిన బ్యాంక్​నుంచి సులభంగా రుణం కూడా పొందొచ్చు. బ్యాంకులతో పాటు పోస్టాఫీస్​ కూడా ఎఫ్​డీ ఖాతాలను ఇస్తుంటుంది. (Bank FD vs post office FD)

ప్రభుత్వ రంగ బ్యాంకింగ్​ దిగ్గజం ఎస్​బీఐ, (Bank FD rates) పోస్టాఫీస్​.. రెండింటిలో ఎఫ్​డీ వడ్డీ రేట్లు ఎందులో ఎక్కువగా ఉన్నాయి? (Bank FD vs post office FD) ఇప్పుడు తెలుసుకుందాం.

పోస్టాఫిస్​ ఫిక్స్​డ్​ డిపాజిట్​పై వడ్డీ రేట్లు ఇలా.. (Post office FD interest rate 2021)

పోస్టాఫీస్​ ఇస్తున్న బెస్ట్​ ఆఫర్లలో.. ఎఫ్​డీ వడ్డీ రేట్లు కూడా ఒకటని చెప్పుకోవచ్చు. కనీసం ఏడాది, గరిష్ఠంగా ఐదేళ్ల వరకు గడువుతో పోస్టాఫీస్​లో ఎఫ్​డీ చేయొచ్చు. ప్రస్తుతం పోస్టాఫీస్​ ఎఫ్​డీకి కనీసం 5.5 శాతం, గరిష్ఠంగా 5.7 శాతం వడ్డీ రేటు ఉంది.

కాలపరిమితి వడ్డీ రేటు
ఏడాది 5.5 శాతం
రెండేళ్లు 5.5 శాతం
మూడేళ్లు 5.5 శాతం
ఐదేళ్లు 5.7 శాతం

ఎఫ్​డీపై ఎస్​బీఐ ఇస్తున్న వడ్డీ రేట్లు ఇవే..

ఎస్​బీఐలో అవసరాన్ని బట్టి 7 రోజుల నుంచి 10 సంవత్సరాల గడువుతో ఫిక్స్​డ్​ డిపాజిట్ చేయొచ్చు. ఇందులో కనీస వడ్డీ రేటు 2.9 శాతం నుంచి గరిష్ఠంగా 5.4 శాతం వరకు ఉంది.

కాలపరిమితి వడ్డీ రేటు
7-45 రోజులు 2.9 శాతం
46-179 రోజులు 3.9 శాతం
180-210 రోజులు 4.4 శాతం
210-365 రోజులు 4.4 శాతం
1-2 ఏళ్ల వరకు 5 శాతం
3-5 ఏళ్ల వరకు 5.3 శాతం
ఐదేళ్లు ఆపై.. 5.4 శాతం

ఇవీ చదవండి:బ్యాంకుల అదిరే ఆఫర్లు- తక్కువ వడ్డీకే హోంలోన్స్​!

ABOUT THE AUTHOR

...view details