తెలంగాణ

telangana

ETV Bharat / business

ఆటోఎక్స్‌పో 2020: కొత్త కార్ల తళుకుబెళుకులు ఇవిగో! - ఫోక్స్‌వ్యాగన్‌

ఆటోఎక్స్​పో 2020 సరికొత్త కార్లతో అదరహో అనిపిస్తోంది. ఫోక్స్​వాగన్​, ఎంజీ మోటార్స్, టాటా మోటార్స్, కియా వంటి పలు దిగ్గజ కంపెనీలు తమ భవిష్యత్​ ప్రణాళికలో ఉన్న వాహనాలను ప్రదర్శించాయి.

autoexpo 2020 Updates: Launches, Photos, Prices and More
ఆటోఎక్స్‌పో 2020: కొత్త కార్ల తళుకుబెళుకులు ఇవిగో!

By

Published : Feb 5, 2020, 3:08 PM IST

Updated : Feb 29, 2020, 6:49 AM IST

ఆటోఎక్స్‌పో 2020 వేదిక కొత్త కార్లతో మెరిసిపోతోంది. పెద్ద కంపెనీలు తమ సరికొత్త వాహనాలను కొలువుదీర్చాయి. మారుతీ ఎండీ, టాటా సన్స్‌ ఛైర్మన్‌ వంటి వాణిజ్య దిగ్గజాలు ఇక్కడకు చేరుకొని తమ కంపెనీల వాహనాలను ఆవిష్కరించారు. ఫోక్స్‌వాగన్‌, ఎంజీ మోటార్స్‌, టాటా మోటార్స్‌ వంటి కంపెనీలు తమ భవిష్యత్తు ప్రణాళికలో ఉన్న వాహనాలను ఇక్కడ తొలిసారి ప్రదర్శించాయి.

ఆటోఎక్స్‌పో 2020: కొత్త కార్ల తళుకుబెళుకులు ఇవిగో!

* మారుతీ సుజుకీ ఫ్యూచర్‌ ఈకాన్సెప్ట్‌ కారును ప్రదర్శించింది. దీనిని కూపే వంటి కాన్సెప్ట్‌తో తయారు చేశారు. ఈ కార్యక్రమంలో కెన్చీ అయుకవా పాల్గొన్నారు. భారత్‌లో పది లక్షల గ్రీన్‌ కార్లను విక్రయించాలన్న మారుతీ లక్ష్యంలో భాగంగా ఈ వాహనాన్ని విడుదల చేశారు.

* రేనాల్ట్‌ సంస్థ కె-జీఈ, జోయి ఎలక్ట్రిక్‌ కార్లను, ట్రైబర్‌ ఏఎంటీ, ట్విజీ కార్గో వాహనాలను ప్రదర్శకు తెచ్చింది. రేనాల్ట్‌ పసిఫిక్‌ విభాగ అధ్యక్షుడు ఫాబ్రిక్‌ కాంబోలివ్‌ క్విడ్‌, ట్రైబర్‌ విజయాలపై మాట్లాడారు. కె-జీఈ వాహనం రేంజి 271 కిలోమీటర్లని కంపెనీ పేర్కొంది.

* టాటా మోటార్స్ గ్రావిటాస్‌, నెక్సన్‌ ఈవీ, హారియర్‌ కార్లను ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో సీఈవో గ్యుంటెర్‌ బుష్చెక్‌, విద్యుత్తు వాహనాల విభాగం అధ్యక్షుడు శైలేష్‌ చంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ మాట్లాడుతూ వచ్చే 18-24 నెలల్లో మరో నాలుగు వాహనాలను మార్కెట్లోకి తీసుకొస్తామన్నారు. ఈ ప్రదర్శనలో టాటాలకు చెందిన హెచ్‌బీఎక్స్‌ చిన్న ఎస్‌యూవీ, సియార్రా రీబార్న్‌ వంటి వాహనాలు ఉన్నాయి.

* టాటా మోటార్స్‌ వాణిజ్య వాహనాల విభాగంలో 12 మీటర్ల లోఫ్లోర్‌ విద్యుత్తు బస్సు, వింగర్‌ బీఎస్‌-6, ప్రైమా ట్రక్‌ ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో టాటా మోటార్స్‌ వాణిజ్య వాహన విభాగం అధిపతి గిరీష్‌ వాఘ పాల్గొన్నారు.

* హ్యుందాయ్‌ టక్సన్‌ కారును ప్రదర్శించింది. దీనికి 2.0లీటర్ల బీఎస్‌-6 ఇంజిన్‌ను అమర్చారు. ఐబ్లూ కార్‌ కనెక్ట్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటివి ఉన్నాయి.

* ఆటోఎక్స్‌పో2020లో ఎంజీ మోటార్స్‌ ది మార్వెల్‌ ఎక్స్‌ ఈవీ, ఈ ఎంజీ6 హైబ్రీడ్‌ సెడాన్‌, 360ఎం, విజన్‌ కాన్సెప్ట్‌-1లను ప్రదర్శనకు పెట్టారు.

* కియా సంస్థ సొనెట్‌ కారును ప్రదర్శనకు ఉంచింది. మారుతీ విటారా బ్రెజాకు పోటీగా దీనిని తీసుకురానుంది.

* ఫోక్స్‌వ్యాగన్‌ కాన్సెప్ట్‌ కారు షార్ట్‌లీని ప్రదర్శించింది.

* జీడబ్ల్యూఎం సంస్థ ప్రపంచంలోనే అత్యంత చౌకైన విద్యుత్తు కారు ఓరా -ఆర్‌1ను ప్రదర్శకు ఉంచింది.

ఇదీ చూడండి:ఏడేళ్ల గరిష్ఠానికి సేవారంగ కార్యకలాపాలు

Last Updated : Feb 29, 2020, 6:49 AM IST

ABOUT THE AUTHOR

...view details