జర్మనీకి చెందిన ప్రముఖ విలాసవంతమైన కార్ల తయారీ సంస్థ ఆడి తన వాహన శ్రేణి (క్యూ- ఫ్యామిలీ)లో ఆడి క్యూ8 ఎస్‌యూవీ వాహనాన్ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రముఖ క్రీడాకారుడు, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దీనిని ఆవిష్కరించారు. దీని ధర రూ.1.33 కోట్లు (ఎక్స్ షోరూం)గా ఉంది.
భారత మార్కెట్లోకి ఆడి క్యూ8
ఆడి క్యూ 8 ఎస్‌యూవీ భారత మార్కెట్లో విడుదలయ్యింది. దీని ధర రూ.1.33 కోట్లు (ఎక్స్ షోరూం)గా ఉంది. ప్రముఖ క్రీడాకారుడు, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దీనిని ఆవిష్కరించారు.
ఆడిక్యూ 8 మోడల్ డిజైన్, భద్రతాపరమైన అంశాల్లో జాగ్రత్తలు తీసుకున్నట్లు సంస్థ ప్రకటించింది. దీనిలో భాగంగానే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్, ఆడి పార్క్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ ప్రోగ్రామ్‌ను ప్రత్యేకంగా రూపొందించారు. 3.0 లీటర్ టీఎఫ్‌ఎస్‌ఐ పెట్రోల్ ఇంజిన్, 500 ఎన్‌ఎం పీక్ టార్క్ వద్ద 340 హెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. కేవలం 5.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునే విధంగా ఈ మోడల్‌ను తీర్చిదిద్దారు. ట్రాన్స్‌మిషన్ డ్యూటీస్‌ను 8-స్పీడ్ టిప్‌ట్రోనిక్ లివర్ ద్వారా నిర్వహిస్తారు.
ఇదీ చూడండి: స్మార్ట్ ఫోన్‌ను కాపాడుకుందాం మరింత ఇస్మార్ట్‌గా