ఏప్రిల్ నెలలో అమ్మకాలను పెంచుకునేందుకు దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ పలు మోడళ్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. అత్యంత ప్రజాదరణ కలిగిన మోడళ్లైన స్విఫ్ట్‌తో పాటు.. ఎస్‌యూవీ సెగ్మెంట్లో గట్టి పోటీనిస్తోన్న విటారా బ్రెజ్జా, ఎస్-క్రాస్లపైన, సెడాన్ రేంజ్ సియాజ్ మోడళ్లపైనా ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుత ఆఫర్లు ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇందులో భాగంగా వినియోగదారులు ఎక్స్ఛేంజ్ బోనస్ సహా.. నగదు తగ్గింపు, కార్పొరేట్ డిస్కౌంట్లను పొందొచ్చని తెలిపింది. మోడళ్ల వారీగా డిస్కౌంట్లు ఇలా ఉన్నాయి..
మారుతీ సుజుకీ స్విఫ్ట్:
ఐదు సీట్ల సామర్థ్యంతో లభించే ఈ కారు ఎక్స్ షోరూమ్ ధర రూ. 5.73లక్షలు. దీనిపై రూ.30,000 నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.20,000 అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
స్విఫ్ట్‌లో ఇతర ప్రత్యేకతలు..
- 7 అంగుళాల టచ్‌స్క్రీన్.
- డ్యూయెల్ ఎయిర్‌బ్యాగులు
- ఎల్ఈడీ లైటింగ్
- 15-అంగుళాల అల్లాయ్ వీల్స్
- 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్
- ఇంజిన్ సామర్థ్యం 88.5 హెచ్‌పీ
మారుతీ సుజుకీ-విటారా బ్రెజ్జా
ఎస్‌యూవీ మోడల్ విటారా బ్రెజ్జా ధర రూ. 7.39 లక్షలు. మొత్తం నాలుగు వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారుపై గరిష్ఠంగా రూ.20,000 వరకు డిస్కౌంట్లను ప్రకటించింది మారుతీ. ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ వేరియంట్లపై రూ.10,000 తగ్గింపు.. జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్ వేరియంట్లపై రూ.20,000 ఎక్సేంజ్ బోనస్‌ను ప్రకటించింది.
బ్రెజ్జా ప్రత్యేకతలు..
- టోటల్ ఎల్ఈడీ లైట్లు
- 16-అంగుళాల అల్లాయ్ వీల్స్
- 5 సీట్ల క్యాబిన్
- 7అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
- ట్విన్ ఎయిర్‌బ్యాగ్‌లు
- 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్
- 103 హెచ్‌పీ సామర్థ్యం
మారుతీ సుజుకీ ఎస్-క్రాస్