తెలంగాణ

telangana

By

Published : Sep 9, 2021, 7:38 AM IST

ETV Bharat / business

Iphone 13: యాపిల్‌ ఐఫోన్‌- 13 విడుదల అప్పుడే..

టెక్ దిగ్గజం యాపిల్​.. ప్రీమియం మొబైల్​ అయిన ఐఫోన్ 13 (Apple iphone 13) లాంఛ్​​ తేదీని ప్రకటించింది. కాలిఫోర్నియాలో జరిగే స్ట్రీమింగ్ ఈవెంట్‌లో దీనిని విడుదల చేయనుంది.

iphone
iphone

ఐఫోన్‌ ప్రేమికులకు శుభవార్త. ఈ నెల 14న ఐఫోన్‌ 13(Iphone 13) విడుదల కార్యక్రమం జరగనున్నట్లు టెక్‌ దిగ్గజం యాపిల్‌ ప్రకటించింది. ఈ కార్యక్రమంలో నాలుగు కొత్త ఐఫోన్‌ మోడళ్లు - ఐఫోన్‌ 13, ఐఫోన్‌ 13 మినీ, ఐఫోన్‌ 13 ప్రో, ఐఫోన్‌ 13 ప్రో మ్యాక్‌లను కంపెనీ విడుదల చేసే అవకాశం ఉంది.

యాపిల్‌ వాచీ సిరీస్‌ 7, కొత్త యాపిల్‌ ఎయిర్‌పాడ్స్‌ 3 వంటి ఉపకరణాలను సైతం విడుదల చేయొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా విడుదల చేసిన తర్వాత భారత్‌లో ఐఫోన్‌ 13 ధరలను(Apple iPhone cost in india) యాపిల్‌ ప్రకటించొచ్చు. దేశీయంగా వీటి విక్రయాలు అక్టోబరులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details