ట్విట్టర్లో అత్యంత చురుగ్గా ఉండే పారిశ్రామికవేత్త.... మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర. తాజాగా... తెలివైన భార్య ఉంటే ఎలాంటి ప్రమాదం ఉంటుందో చెబుతూ ఆయన ఓ సరదా ట్వీట్ చేశారు. దీనికిప్పుడు సోషల్ మీడియాలో విశేష స్పందన వస్తోంది.
ఓ వార్తా పత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు ఆనంద్. "ఓ వ్యక్తి తన భార్య మాటలు వినకూడదనే ఉద్దేశంతో 62ఏళ్ల పాటు మూగ, చెవిటివాడిగా నటించాడు" అన్నది ఆ వార్త సారాంశం.
ఆ వార్త పేపర్ క్లిప్పింగ్తోపాటు మహీంద్ర ఓ శీర్షిక రాశారు. "ఇది చదివి 5 నిమిషాలు ఆగకుండా నవ్వాను. నేను కూడా ఇలాగే చేస్తే ఏంచేస్తావని నా భార్యను అడిగాను" అని.