అంకుర సంస్థలకు అండగా జియో..
- భారతీయ అంకుర సంస్థలకు అత్యుత్తమ భాగస్వామిగా రిలయన్స్ జియో: ముకేశ్
- భారతీయ అంకుర సంస్థలు వారి లక్ష్యాలు చేరుకునే దిశా జియో సహకారం: ముకేశ్
15:09 July 15
అంకుర సంస్థలకు అండగా జియో..
14:59 July 15
విప్లవాత్మక మార్పులు...
14:48 July 15
'జియో-5జీ సేవలతో ప్రపంచ దశ, దిశ మారనుంది'
14:37 July 15
14:36 July 15
14:24 July 15
భారత్‌లో వచ్చే ఏడాదిలోనే జియో 5జీ: ముఖేశ్ అంబానీ
వచ్చే ఏడాది ప్రారంభం నాటికి జియో 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని ముఖేశ్ అంబానీ తెలిపారు.
14:17 July 15
గూగుల్‌తో రిలయన్స్ భాగస్వామ్యం: ముకేశ్ అంబానీ
ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో కలిసి పనిచేయడానికి ముందుకొచ్చింది: ముకేశ్ అంబానీ
14:14 July 15
150 కోట్ల విలువైన కంపెనీగా రిలయన్స్: ముఖేశ్ అంబానీ
రిలయన్స్ ఏజీఎంలో ముకేశ్ అంబానీ వాటాదార్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
"ఆధునిక మానవ చరిత్రలో దారుణమైన సంక్షోభాన్ని కరోనా తెచ్చింది. అయితే సంక్షోభంలోనే అవకాశాలు అందుకునే దిశగా రిలయన్స్ ప్రయత్నం చేసింది. డిజిటల్ అనుసంధాన వేదికగా జియో మీట్‌ను తీసుకొచ్చాం.
ఫేస్బుక్ నుంచి క్వాల్కం వరకు విదేశీ సంస్థల భాగస్వామ్యంతో 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ గల సంస్థగా నిలిచాం. సాంకేతిక విపణిలో శరవేగంగా విస్తరిస్తున్నాం." - ముకేశ్ అంబానీ
14:02 July 15
రిలయన్స్ ఏజీఎంలో మాట్లాడుతున్న ముఖేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) ప్రారంభం అయ్యింది. సంస్థ అధిపతి ముఖేశ్ అంబానీ వాటాదార్లను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు.
13:36 July 15
మరికాసేపట్లో ప్రారంభం కానున్న రిలయన్స్ ఏజీఎం
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సర్వ సభ్య సమావేశం (ఏజీఎం) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కరోనా నేపథ్యంలో ఈసారి ఏజీఎంను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నారు.
దేశంలో అతిపెద్ద లిస్టెడ్ కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్. సంస్థకు చెందిన టెలికాం విభాగం జియోకు వచ్చిన భారీ పెట్టుడులతో ఈ స్థాయికి ఎదిగింది. ఏటా వాటాదారులను ఉత్సాహపరిచే ప్రకటనలు చేసే రిలయన్స్.. ఈ సారి రుణరహితంగా మారిపోయింది. మరి తాజా ఏజీఎంలో ఎలాంటి ప్రకటనలు చేస్తారోనని అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది.