తెలంగాణ

telangana

ETV Bharat / business

'5జీ వస్తేనే ప్రజలందరికీ డిజిటల్​ విప్లవ ఫలితాలు' - భారత్​లో మొబైల్​ నెట్వర్క్​లు

Digital Innovation In India: ఐదో తరం సాంకేతికతను అందిపుచ్చుకోవడం ద్వారా దేశంలో డిజిటల్​ విప్లవాన్ని కొత్తపుంతలు తొక్కించవచ్చని రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ అన్నారు. పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే.. ప్రజలకు డిజిటల్​ విప్లవ ఫలితాలు అందుతాయని పేర్కొన్నారు. ఇందుకుగాను ఈ సాంకేతికతను దేశ ప్రాధాన్యం ఉన్న అంశంగా గుర్తించాలని కోరారు.

Ambani
అంబానీ

By

Published : Dec 8, 2021, 2:06 PM IST

Updated : Dec 8, 2021, 3:11 PM IST

Digital Innovation In India: డిజిటల్​ విప్లవాన్ని కొత్త పుంతలు తొక్కించేలా.. ఐదో తరం సాంకేతికతను భారత్​ తీసుకొస్తుందని రిలయన్స్​ అధినేత ముకేశ్​ అంబానీ అన్నారు. దీనిని జాతీయ ప్రాధాన్యంగా పరిగణించి ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. ఈ మేరకు ఇండియన్ మొబైల్​ కాంగ్రెస్​లో ఆయన మాట్లాడారు. ప్రజలు 2జీ నుంచి 4జీ, 5జీ సేవలను త్వరితగతిన అందిపుచ్చుకోవాలని కోరారు.

సామాజిక, ఆర్థిక పరిస్థితుల కారణంగా లక్షలాది మంది భారతీయులు 2జీకి పరిమితమవ్వడం వల్ల వారు డిజిటల్ విప్లవ ప్రయోజనాలకు దూరం అవుతున్నారని అన్నారు అంబానీ. ఈ సమస్యను అధిగమించేందుకు ఐదోతరం సాంకేతికతను అందిపుచ్చుకోవడం.. జాతీయస్థాయిలో ప్రధానాంశంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. భారత్‌లో మొబైల్ చందాదారులు అంతకంతకూ పెరుగుతున్న విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. కొత్త సాంకేతికను అందిపుచ్చుకోవాలి కానీ వెనక్కి వెళ్లకూడదని చెప్పారు. అలాగే ఫైబర్​ కనెక్టివిటీని కూడా దేశవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఆ లక్ష్యంలో మొబైల్ ఇండస్ట్రీదే కీ రోల్​..

2025 నాటి ఐదు ట్రిలియన్​ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని భారత్​ భావిస్తున్న నేపథ్యంలో మొబైల్​ ఇండస్ట్రీ కీలక పాత్ర పోషిస్తుందని ఆదిత్య బిర్లా గ్రూప్​ ఛైర్మన్ కుమార​ మంగళం బిర్లా అన్నారు. సుమారు ఒక ట్రిలియన్ డాలర్లు డిజిటల్ ఎకానమీ నుంచి అందుతాయని పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా కలను సాకారం చేసుకోవడంలో ఈ రంగంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి ఉందన్నారు. గత కొద్ది నెలలుగా కేంద్రం చేపట్టిన విధానాల కారణంగా వ్యాపారం సులభతరం అవడమే కాక బ్యాంకింగ్ రంగం నుంచి కూడా మద్దతు లభిస్తుందని తెలిపారు. ఇది ఇలానే కొనసాగితే ప్రపంచ సాంకేతికతను అదిపుచ్చుకోవడం భారత్​కు పెద్ద కష్టమేమీ కాదన్నారు.

స్పెక్ట్రమ్​ ధరలపై దృష్టిసారించాలి..

టెలికాం రంగంలో రెగ్యులేటరీ విధానం సరళంగా ఉండాలని భారతీ ఎయిర్​టెల్​ ఛైర్మన్​ సునీల్​ మిత్తల్​ అన్నారు. స్పెక్ట్రమ్ ధరలను తగ్గించాలని కోరారు. కొన్ని ప్రాంతాల్లో టవర్ల నిర్మాణాలకు కంపెనీలు కలిసి పనిచేయాలని సూచించారు.

ప్రపంచమంతా భారత్​ వైపే చూస్తుంది..

5జీ టెక్నాలజీ, ఆర్టిఫీషియల్​ ఇంటెలిజెన్స్​, రోబోటిక్స్​ లాంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో సమర్థమైన సాంకేతికత కోసం ప్రపంచమంతా భారత్​ వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆన్నారు. దేశీయ ఆవిష్కరణలు సామాన్యుల జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకువస్తాయో చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:అబుదాబిలో రిలయన్స్‌ భారీ పెట్టుబడులు

Last Updated : Dec 8, 2021, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details