తెలంగాణ

telangana

ETV Bharat / business

అమెజాన్​: భారత యూనిట్ల కోసం రూ.1,700 కోట్లు - Amazon

భారత్​లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తృతం చేసుకోవాలని ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భావిస్తోంది. అందులో భాగంగా భారత్​లో తన చెల్లింపులు, హోల్​సేల్ బిజినెస్​ యూనిట్ల కోసం రూ.1,700 కోట్లు కేటాయించింది.

Amazon pumps in over Rs 1,700 crore into India units
అమెజాన్​: భారత్​లోని యూనిట్ల కోసం రూ.1,700 కోట్లు

By

Published : Jan 15, 2020, 2:45 PM IST

ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్​... భారత్​లో తన చెల్లింపులు, హోల్​సేల్ బిజినెస్​ యూనిట్ల కోసం రూ.1,700 కోట్లు కేటాయించింది. దీని ద్వారా భారత్​లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకోవాలని భావిస్తోంది.

అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్.కామ్​.ఐఎన్​సీఎస్​.లిమిటెడ్​... అమెజాన్ పే ఇండియాకు రూ.1,335కోట్లు అందించాయి. ఫలితంగా అమెజాన్ హోల్​సేల్​(ఇండియా)కు రూ.360 కోట్ల విలువైన షేర్లను అమెజాన్ కార్పొరేట్ హోల్డింగ్స్, అమెజాన్.కామ్.ఐఎన్​సీఎస్​. లిమిటెడ్​లకు కేటాయించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖకు అందించారు.

డిజిటల్ చెల్లింపు యూనిట్​ 2019 డిసెంబర్​ 31న షేర్లను కేటాయించగా, అమెజాన్ హోల్​సేల్ (ఇండియా) డిసెంబర్ 30న కేటాయింపులు చేసింది. అయితే ఫండ్ ఇన్​ఫ్యూషన్​పై అమెజాన్ ఇండియాకు పంపిన ఈ-మెయిల్స్​పై ఎలాంటి స్పందన రాలేదు.

భారత్​లో బెజోస్​

భారత్​లో పర్యటిస్తున్న అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్​... చిన్న, మధ్య తరహా వ్యాపారాలను డిజిటలైజ్ చేయడానికి దేశంలో 1 బిలియన్​ డాలర్లు పెట్టుబడిపెడుతున్నట్లు ప్రకటించారు. అలాగే తన పర్యటనలో భాగంగా ప్రభుత్వ పెద్దలతో, వ్యాపారులతో, ఎస్​ఎమ్​బీలతో కలిసే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:భారత్​లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి: జెఫ్​ బెజోస్​

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details