భారత ఆన్‌లైన్ ఫార్మసీ రంగంలోకి ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అడుగుపెట్టింది. అమెజాన్ ఫార్మసీ పేరుతో ఈ సేవలను బెంగళూరులో ముందుగా ప్రారంభించింది.
అమెజాన్‌లో ఇక నుంచి ఔషధాల డెలివరీ - Amazon India
దేశీయ ఆన్‌లైన్ ఫార్మసీలోకి ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రవేశించింది. అమెజాన్ ఫార్మసీ పేరుతో తొలుత బెంగళూరులో సేవలను ప్రారంభించింది. ఫలితంగా ఈ విభాగంలో ఇప్పటికే ఉన్న ఫార్మసీ సంస్థలకు పోటీ ఇచ్చే అవకాశముంది.
ఆన్‌లైన్ ఫార్మసీలోకి అమెజాన్.. బెంగళూరులో ప్రారంభం
ఈ విభాగంలో ఇప్పటికే నెట్‌మెడ్స్, ఫార్మ్‌ఈజీ, 1ఎంజీ వంటి సంస్థలకు అమెజాన్ గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది. చెన్నైకు చెందిన నెట్‌మెడ్స్‌ను ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేయనున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకున్నాయి. ఫార్మ్‌ఈజీ, మెడ్‌లైఫ్ సంస్థలు కూడా విలీనం దిశగా అడుగులు వేస్తున్నాయి.
ఇదీ చూడండి:ముకేశ్ అంబానీ తర్వాత ఎవరు?