చైనా ఆన్లైన్ వ్యాపార దిగ్గజం ఆలీబాబా హోల్డింగ్స్.. ఈసారి ‘సింగిల్స్డే’ షాపింగ్ బొనాంజా సందర్భంగా రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. చైనా కాలమానం ప్రకారం ఈ ఉదయం 8 గంటలకు అమ్మకాలు మొదలయ్యాయి. తొలి గంటలోనే 84 బిలియన్ యువాన్లు(12 బిలియన్ డాలర్లు)కు చేరాయి. 2018లో 30.8 బిలియన్ డాలర్ల అమ్మకాలు కాగా... ఈ సారి 16 గంటల్లోనే (223 బిలియన్ యువాన్లు) 31.82 బిలియన్ డాలర్లకు అమ్మకాలు చేరుకున్నాయి. మొత్తంగా 38.38 బిలియన్ డాలర్ల అమ్మకాలు జరిగాయి.
11.11 ప్రత్యేకం
గతేడాది 69 బిలియన్ యువాన్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. అమెరికాలో నిర్వహించే ‘బ్లాక్ ఫ్రైడే’, ‘సైబర్ మండే’ వంటి ఆన్లైన్ షాపింగ్ ఉత్సవాలకు దీటుగా ఆలీబాబా ఛైర్మన్ డేనియల్ జాంగ్ 2009 నుంచి ‘సింగిల్స్ డే’ను నిర్వహస్తున్నారు. నవంబర్ 11(11/11)న చైనాలో నిర్వహించే ఈ ఉత్సవాన్ని ‘డబుల్ ఎలెవెన్’ అని కూడా పిలుచుకుంటారు. ఈ షాపింగ్ ఫెస్టివల్ ఒంటరి పక్షులకు ప్రత్యేకం.