పెప్సికో-బ్రాండెడ్ స్నాక్స్ కొనుగోలు చేసినవారికి 2జీబీ వరకు ఉచిత డేటాను అందించనుంది ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్. ఇందుకోసం పెప్సికో ఇండియా, ఎయిర్‌టెల్ మధ్య ఒప్పందం కుదిరింది. లేస్, కుర్కురే, అంకుల్ చిప్స్, డోరిటోస్‌లను కొన్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది ఎయిర్‌టెల్.
ఆ చిప్స్ కొంటే.. 2 జీబీ డేటా ఉచితం - ఎయిర్‌టెల్ తాజా డేటా ఆఫర్
ఇకపై లేస్, కుర్కురే, అంకుల్ చిప్స్ ప్యాకెట్లను కొన్న వారికి 2 జీబీ డేటాను అందించనుంది ప్రముఖ టెలికాం దిగ్గజ సంస్థ ఎయిర్‌టెల్. ఇందుకోసం పెప్సికో, ఎయిర్‌టెల్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రూ.10 లేస్ ప్యాకెట్ కొన్న వారికి 1 జీబీ డేటా, రూ.20 ప్యాకెట్‌కు 2జీబీ డేటా ఉచితంగా పొందవచ్చు.
ఈ ఆఫర్ ప్రకారం రూ.10 ప్యాకెట్ కొన్నవారికి 1 జీబీ డేటా, రూ. 20లకు 2 జీబీ డేటా ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది.
అయితే ఈ ఆఫర్ కేవలం కస్టమర్లు మూడు సార్లు మాత్రమే వినియోగించుకోవాలి. అంటే మూడు రూ.20 ప్యాకెట్లను కొన్నవారికి 6 జీబీ డేటా వస్తుంది. ఒక్కసారి కూపన్‌ను స్కార్చ్ చేసి కోడ్‌ను ఎంటర్‌చేస్తే మూడు రోజుల వరకు డేటా వ్యాలిడిటీ ఉంటుందని సంస్థ ప్రకటించింది.
ప్యాకెట్లో వచ్చే సదరు కూపన్ ద్వారా 4జీబీ డేటాను పొందవచ్చు. దీని కోసం ఎయిర్‌టెల్ థ్యాంక్స్ యాప్‌లోని మై కూపన్ సెక్షన్లోకి వెళ్లి స్కాన్ చేస్తే డేటా అవుతుందని సంస్థ పేర్కొంది.. ఈ కూపన్ ఆఫర్ 2021 జనవరి 31 వరకు వర్తిస్తుంది.