దేశంలోనే అత్యంత పెద్ద టెలికాం నెట్వర్క్ ఉన్న భారతీ ఎయిర్టెల్ ఈ -బుక్ సేవల్లోకి అడుగుపెట్టనుంది. 'ఎయిర్టెల్ బుక్స్' యాప్ ద్వారా అందించనున్న ఈ సేవలను ఎయిర్‌టెల్‌తో పాటు ఇతర నెట్వర్క్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ-బుక్ సేవల్లోకి టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ - ఎయిర్టెల్
ఈ-బుక్ సేవలను త్వరలో ప్రారంభించనున్నట్టు తెలిపింది టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్.
ఈ-బుక్ సేవల్లోకి టెలికాం దిగ్గజం ఎయిర్టెల్
మొదటి 30 రోజుల పాటు ఉచితంగా ఈ యాప్ వాడుకోవచ్చు. మొదట 70వేల దేశీయ, విదేశీ రచయితల పుస్తకాలతో దీన్ని ప్రారంభించనున్నారు. అనంతరం ఆరు నెలలకు రూ.129, సంవత్సరానికి రూ.199 చందా వసూలు చేయనుంది ఎయిర్టెల్.
ఇదీ చూడండి:తప్పుడు వార్తలకు 'టిప్‌లైన్'తో కళ్లెం!