ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / business

ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకులో 24X7 నెఫ్ట్​ సేవలు - ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకు

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఇక నుంచి 24X7 నెఫ్ట్‌ సేవలు అందుబాటులో ఉంటాయని ఆ సంస్థ ప్రకటించింది. వినియోగదారులు యాప్‌ లేదా వెబ్‌సైట్‌ నుంచి నెఫ్ట్ సేవలు వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది.

airtel payments bank providing 24x7 NEFT service
ఎయిర్​టెల్​ పేమెంట్స్ బ్యాంకులో 24X7 నెఫ్ట్​ సేవలు
author img

By

Published : Dec 26, 2019, 9:28 PM IST

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌లో ఇకపై రోజుకు 24 గంటలు చొప్పున, పూర్తి వారం పాటు 'ఎన్​ఈఎఫ్​టీ' లావాదేవీలు జరుపుకొనే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది ఎయిర్​టెల్​.

నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌పై ఇటీవలే ఆర్​బీఐ మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో తమ వినియోగదారులు ఏ సమయంలోనైనా 'ఎన్​ఈఎఫ్​టీ' చేసుకునేలా ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ ఏర్పాట్లు చేసింది. బ్యాంకు వినియోగదారులు... ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ గివింగ్‌ యాప్‌ లేదా వెబ్‌సైట్‌ నుంచి ఈ సేవలు వినియోగించుకోవచ్చునని తెలిపింది.

ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ను జనవరి 2017లో ఏర్పాటు చేశారు. భారత్‌లో ఇదే తొలి పేమెంట్స్‌ బ్యాంక్‌. ఎయిర్‌టెల్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌కు దాదాపు 4 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

ఇదీ చూడండి: ఆ పథకంలో చేరితే పెన్షన్​ రెట్టింపు?

ABOUT THE AUTHOR

author-img

...view details