భారత్ నుంచి విదేశాలకు వెళ్లే విమాన ధరలకు రెక్కలొచ్చాయి. జులైతో పోలిస్తే ఆగస్టు నాటికి ఎకానమీ తరగతి టికెట్టు ధరలు గణనీయంగా పెరిగాయని ఈస్‌మైట్రిప్.కామ్ తెలిపింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగినందునే ధరల్లో ఈ పెరుగుదలకు కారణం అని చెప్పింది.
ఈజ్‌మైట్రిప్.కామ్ డేటా ప్రకారం..
- దిల్లీ నుంచి అమెరికాలోని నేవార్క్కు వెళ్లే.. ఎకానమీ తరగతి విమానాల ధర.. జులైలో ఉండగా రూ.69,034 ఉండగా.. ఆగస్టులో రూ.87,542కు చేరింది.
- జులై నెలలో ముంబయి-మాస్కోకు వెళ్లే ఎకానమీ తరగతి టికెట్టు రూ.43,132గా ఉండగా.. ముంబయి- దోహ టికెట్టు ధర రూ.11,719గా ఉంది. అయితే ఈ ధరలు ఆగస్టు నాటికి క్రమంగా రూ.85,024, రూ.18,384కు చేరాయి.
జులై పోల్చితే ఆగస్టులో సగటు ఎకానమీ టికెట్టు తరగతుల ధరలు భారీగా పెరిగాయని ఈస్‌మైట్రిప్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు నిషాంత్ పిట్టి తెలిపారు.
"ఇటీవల అనేక దేశాలు తమ ప్రయాణ నిబంధనలను సడలించాయి. దాంతో విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య పెరిగింది. ఇంధన ధరలు పెరగడం, సీట్ల కొరత వంటివి.. ఈ మార్గాల్లో విమాన ధరలు పెరగడానికి మరో కారణం. భారత్‌లో వ్యాక్సినేషన్ డ్రైవ్ పూర్తైతే విదేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నాం."
-నిశాంత్ పిట్టి, ఈస్‌మైట్రిప్.కామ్ సీఈఓ.