తెలంగాణ

telangana

ETV Bharat / business

కరోనా ఎఫెక్ట్​: విమానసేవల నిలిపివేత కొనసాగింపు - ఎయిర్​ఇండియా

దిల్లీ నుంచి షాంఘై, హాంకాంగ్ విమాన సర్వీసుల నిలిపివేతను కొనసాగిస్తూ ఎయిర్​ఇండియా నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్​ విజృంభణ తగ్గని కారణంగా సేవలను మరిన్ని రోజులు రద్దు చేస్తున్నట్లు సంస్థ తెలిపింది.

airindia
ఎయిర్​ఇండియా

By

Published : Feb 20, 2020, 5:50 PM IST

Updated : Mar 1, 2020, 11:37 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తిని నిరోధించే ప్రయత్నంలో చైనా ఉండగా.. ఆ దేశానికి విమాన సేవలను నిలిపివేతను కొనసాగిస్తూ ఎయిర్​ఇండియా నిర్ణయం తీసుకుంది. జూన్​ 30 వరకు చైనాకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

"దిల్లీ-షాంఘై, దిల్లీ-హాంకాంగ్​ మధ్య జూన్​ 30వరకు విమాన సర్వీసులు రద్దు చేస్తున్నాం."

- ఎయిర్​ఇండియా అధికార ప్రతినిధి

కరోనా విజృంభణ కారణంగా జనవరి 31 నుంచి చైనాకు విమాన సర్వీసులను రద్దు చేసింది ఎయిర్​ఇండియా. ఫిబ్రవరి 15న సేవలు ప్రారంభించాల్సి ఉన్నా.. పొడిగిస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

అంతకుముందు ఇండిగో, స్పైస్​ జెట్ కూడా​ భారత్​-చైనా సర్వీసులను రద్దు చేశాయి.

Last Updated : Mar 1, 2020, 11:37 PM IST

ABOUT THE AUTHOR

...view details