ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరులో భారత్‌కు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు(ఏడీబీ) అండగా నిలిచింది. 2.2 బిలియన్ డాలర్ల(సుమారు రూ.16,500కోట్లు) ప్యాకేజీతో మద్దతిస్తామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు బ్యాంకు అధ్యక్షుడు మసట్సుగు అసకావ హామీ ఇచ్చారు.
వైరస్‌పై యుద్ధంలో భారత్ చేపడుతున్న చర్యలను మసట్సుగు ప్రశంసించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన.. ఆర్థిక ప్యాకేజీ, వ్యాపారాలకు ఉపశమనం, జాతీయ ఆరోగ్య అత్యవసర కార్యక్రమం వంటి చర్యలను కొనియాడారు.
"అత్యవసర పరిస్థితుల్లో భారత్‌కు ఏడీబీ అండగా ఉంటుంది. దేశంలోని ఆరోగ్య విభాగం, పేదలు, కార్మికులపై మహమ్మారి ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని తక్షణమే 2.2 బిలియన్ డాలర్ల సహాయం అందించడానికి ఏడీబీ సిద్ధమవుతోంది."