భారత శ్రీమంతుడు, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్ అంబానీ మరోసారి తనకు పోటీలేదని నిరూపించారు. 2019లో ఈయన సంపద ఏకంగా 17 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.20 లక్షల కోట్లు) పెరిగింది. ఆసియాలో ఇదే అత్యధికం. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ల సూచీ ప్రకారం.. డిసెంబరు 23కు ముకేశ్ నికర సంపద దాదాపు 61 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4.27 లక్షల కోట్లు). ఇదే సమయంలో అలీబాబా గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మా సంపద 11.3 బిలియన్ డాలర్లు పెరగ్గా, అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ ఆస్తి 13.2 బిలియన్ డాలర్లు తగ్గింది.
ముకేశ్‌కు కలిసొచ్చిన 2019.. భారీగా పెరిగిన సంపద - Reliance Jio
ముకేశ్ అంబానీ మరోసారి సత్తాచాటారు. 2019లో ఈయన సంపద ఏకంగా 17 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.1.20 లక్షల కోట్లు) పెరిగింది. ఆసియాలో ఇదే అత్యధికం. ప్రారంభించిన మూడేళ్లలోనే టెలికాం రంగంలో జియో సంచలనాలు సృష్టించింది. భారత్‌లో అగ్రగామి సంస్థగా అవతరించింది.
ముకేశ్‌కు కలిసొచ్చిన 2019
జోరుకు కారణాలివే
- 2019లో రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) షేరు ఏకంగా 40 శాతం దూసుకెళ్లింది. ఇదే సమయంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీ లాభంతో పోలిస్తే ఆర్‌ఐఎల్ షేరు రెట్టింపు పరుగులు తీసింది.
- చమురు శుద్ధి, పెట్రో రసాయనాల వ్యాపారాల నుంచి నెమ్మదిగా రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్ వంటి వినియోగదారు విభాగాల వైపు కంపెనీ అడుగులు వేయడం మదుపర్లను మెప్పించింది.
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ సంస్థలకు పోటీగా స్థానిక ఇ-కామర్స్ సంస్థను నెలకొల్పాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.
- ప్రారంభించిన మూడేళ్లలోపే జియో.. భారత్‌లో అగ్రగామి టెలికాం సంస్థగా అవతరించి సత్తా చాటింది. వచ్చే మూడేళ్లలో కొత్త వ్యాపారాలు రిలయన్స్ ఆదాయంలో 50% సమకూర్చనున్నాయి.
- 2021 నాటికి రిలయన్స్ గ్రూప్‌ను రుణరహిత సంస్థగా మారుస్తామని ప్రకటించడంతో షేరు ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఇందు కోసం సౌదీ అరామ్‌కోకు వాటా విక్రయించనున్నట్లు అంబానీ ప్రకటించారు.
- 2016లో రిలయన్స్ జియో సేవలు ప్రారంభమైన తర్వాత.. ఇప్పటి వరకు ఆర్‌ఐఎల్ షేరు మూడింతలు లాభపడింది.
ఇదీ చూడండి: అంబానీ పేరుకు అర్థం తెలిస్తే షాక్ అవుతారు