తెలంగాణ

telangana

ETV Bharat / budget-2019

బడ్జెట్​ 19: పెట్రోల్​, డీజిల్​పై అదనపు వడ్డింపు - డీజిల్​

పెట్రోల్​, డీజిల్​పై లీటర్​కు రూపాయి అదనపు దిగుమతి సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. విదేశీ వస్తువుల దిగిమతిపై ఆధారపడకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. బంగారం దిగుమతి సుంకం 12.50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు.

బడ్జెట్​ 19: పెట్రోల్​, డీజిల్​పై అదనపు వడ్డింపు

By

Published : Jul 5, 2019, 2:31 PM IST

మేక్​ ఇన్​ ఇండియా పథకంలో భాగంగా దేశీయ ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు పలు వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. విదేశీ వస్తువులపై ఎక్కువగా ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు.

బడ్జెట్​ 19: పెట్రోల్​, డీజిల్​పై అదనపు వడ్డింపు
పీవీసీ, వినైల్‌ ఫ్లోరింగ్‌ షీట్స్‌, టైల్స్‌, మెటల్‌ ఫిటింగ్స్‌, సీసీ కెమెరాలు, మార్బుల్స్‌, ఫర్నీచర్, వాహన విడిభాగాలు, ముడి జీడిపప్పు, ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్స్‌, ఐపీ కెమెరాలు, డిజిటల్‌ నెట్‌వర్క్‌ వీడియో రికార్డర్స్‌పై దిగుమతి సుంకం పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు.

బంగారం దిగుమతులపై కస్టమ్స్‌ సుంకం 10 నుంచి 12.50 శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు నిర్మల.

పెట్రోల్​, డీజిల్​పై అదనపు వడ్డింపు..

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పెట్రో ఉత్పత్తుల ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయన్నారు ఆర్థిక మంత్రి. ఈ మేరకు డీజిల్‌, పెట్రోల్‌పై లీటర్‌కు రూపాయి అదనపు సుంకం విధిస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details