తెలంగాణ

telangana

ETV Bharat / budget-2019

పెట్రో వాత రూ.2 కాదు... అంతకుమించి! - excise duty

బడ్జెట్​లో ఇంధనంపై సుంకాలు, సెస్​ విధింపు నిర్ణయంతో పెట్రోల్​, డీజిల్​ ధరలు లీటర్​కు రూ.2 పెరగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నులతో కలిపి ఈ మొత్తం మరింత పెరుగుతుంది.

పెట్రోల్​

By

Published : Jul 5, 2019, 7:16 PM IST

ఇప్పటికే ఆకాశాన్నంటిన ఇంధర ధరలను బడ్జెట్​ మరో మెట్టు పైకెక్కించింది. ఇంధనాలపై ఎక్సైజ్​ సుంకం, రహదారి​, మౌలిక సదుపాయాల సెస్​​ విధిస్తున్నట్లు బడ్జెట్​లో ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. ఫలితంగా లీటర్​కు రూ.2 చొప్పున పెరుగనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నులతో కలిపి ఈ పెరుగుదల మరింత ఎక్కువగా ఉంటుంది.

దిల్లీలోని స్థానిక అమ్మకపు పన్ను, కేంద్ర ఎక్సైజ్​ డ్యూటీ కలిపి ఈ మొత్తం రూ.2.5 చేరుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వ్యాట్​ 33 శాతానికి మించి ఉంది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో ఈ పెరుగుదల ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ పెంపుతో దేశవ్యాప్తంగా ప్రజలపై రూ.28 వేల కోట్లు అదనపు భారం పడనుంది.

అంతేకాకుండా టన్ను ముడి చమురుపై రూ.1 దిగుమతి సుంకాన్ని పెంచింది. దేశంలో ఏటా రూ.220 మిలియన్ టన్నుల ముడిచమురు దిగుమతి చేసుకుంటోంది భారత్​. ఫలితంగా రూ.22 వేల కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి లభించనుంది.

ఇదీ చూడండి: బడ్జెట్ 2019: ఈ వస్తువులు మరింత ప్రియం

ABOUT THE AUTHOR

...view details