మొదటి విడత పరిషత్ ఎన్నికలకు ప్రచారం రేపటితో ముగియనుంది. ఈ నెల ఆరున ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. అభ్యర్థులు రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రచారాలు ముగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. టీవీ ఛానెళ్లలో ప్రకటనలు చేయకూడదని ఆంక్షలు విధించింది. రేపు సాయంత్రం తర్వాత ప్రచారానికి వచ్చిన స్థానికేతరులందరూ ఆయా ప్రాంతాలు వదిలి వెళ్లాలని ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘించిన వారికి రెండేళ్ల వరకు జైలుశిక్ష లేదా జరిమానా విధిస్తామని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
రేపటితో మొదటి విడత పరిషత్ ఎన్నికల ప్రచారం బంద్ - పరిషత్ ఎన్నికలు
మొదటి విడత పరిషత్ ఎన్నికల ప్రచారానికి రేపటితో తెరపడనుంది. రేపు సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రచారానికి వచ్చిన స్థానికేతరులందరూ ఆయా ప్రాంతాలను వదిలి వెళ్లాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. టీవీ ఛానెళ్లలో ప్రకటనలపై ఆంక్షలు విధించింది.
ఎన్నికలు