తెలంగాణ

telangana

ETV Bharat / briefs

రికార్డ్​: పావుకిలో బరువుతో పుట్టిన పాప క్షేమం

అమెరికా కాలిఫోర్నియాలో అత్యంత చిన్న శిశివు ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా డిశ్చార్జ్​ అయింది. 23 వారాలకే జన్మించిన ఈ పాప 245 గ్రాముల బరువుతో పుట్టింది. ప్రస్తుతం 2 కిలోలకు పెరిగి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

సేబీ

By

Published : May 30, 2019, 3:58 PM IST

Updated : May 30, 2019, 4:48 PM IST

బతికి నిరూపించిన అతిచిన్న పాప

అమెరికా కాలిఫోర్నియాలో ఓ ఆసుపత్రిలో అద్భుతం చోటు చేసుకుంది. 5 నెలలకే అతితక్కువ బరువుతో జన్మించిన ఓ శిశువు ఆరోగ్యంగా పెరుగుతోంది. పుట్టినప్పుడు కేవలం పావుకిలో ఉన్న ఆ పాపాయి 'సేబీ' బరువు ప్రస్తుతం 2 కిలోలకు పెరిగింది. 5 నెలలుగా వైద్యుల పర్యవేక్షణలో ఉన్న బాలిక నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్​ అయింది.

శాన్​ డియాగోలోని మేరీ బిర్చ్​ ఆసుపత్రి ఈ అద్భుతానికి వేదికయింది. తక్కువ బరువుతో పుట్టి ఇంతకాలం ఆసుపత్రిలోనే ప్రత్యేక పర్యవేక్షణతో పెంచారు.

"శిశువు ఆరోగ్యంగా ఉండేలా మాకు సాధ్యమైనన్ని విధాలా పనిచేస్తాం. మిగితాదంతా ఆ పిల్లల చేతుల్లోనే ఉంటుంది. కొంత మందికి గర్భాశయం వెలుపల పెరిగే శక్తి ఉంటుంది."

- స్ప్రింగ్​ బ్రిడ్జెస్​, ఆసుపత్రి నర్సు

అత్యంత భయంకరమైన రోజు

సేబీ పుట్టిన నాడు అత్యంత భయకరంగా గడిచిందని సేబీ తల్లి తెలిపారు. ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు 'ప్రీక్లాంప్సియా' వ్యాధితో బాధ పడుతున్నారు. ఆ సమయంలో రక్తపోటు 200లకు చేరుకోవటం వల్ల ముందుగానే శిశువుకు జన్మనిచ్చారామె. తన బిడ్డ బతికేందుకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

"నేను ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాను. మేం ఇంటికి వెళ్లినా ఈ రోజును నేను ఎప్పటికీ మరిచిపోను. ఈ రోజును ఏటా వేడుక చేసుకుంటాం. మా జీవితంలో ఇదో ప్రత్యేక సందర్భం."

-సేబీ తల్లి

అతి తక్కువ బరువుతో పుట్టిన శిశువు ఇన్ని రోజులు ఆరోగ్యంగా జీవించటం ఇదే మొదటి సారని 'యూనివర్సిటీ ఆఫ్ లోవా' ఆచార్యులు డాక్టర్​ ఎడ్వర్డ్​ బెల్​ చెప్పారు.

ఇదీ చూడండి: ఈ 'మల్లేశం' ... అందరికీ ఆదర్శం

Last Updated : May 30, 2019, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details