దేశీయ క్రికెట్ పండుగ ఐపీఎల్లో... ముంబయిలోని వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య నేడు రాత్రి 8 గంటలకు మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఇరుజట్లలోని భారత ఆటగాళ్లు ఎలా ఆడతారనేది ఆసక్తికరం.
అందరి చూపు ముంబయి జట్టులోని కీలక ఆటగాళ్లయిన హార్దిక్ పాండ్యా, బుమ్రాపైనే. రోహిత్ శర్మ సారథ్యంలో వారు ఎలాంటి మెరుపులు మెరిపిస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. గాయం నుంచి కోలుకున్న హార్దిక్ పాండ్యాపై జట్టు డైరెక్టర్ జహీర్ ప్రత్యేక దృష్టి సారించాడు.
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి ఫిట్‌నెస్‌పై జట్టు ప్రత్యేక దృష్టి సారించింది -జహీర్ ఖాన్, ముంబయి జట్టు డైరెక్టర్
భారత జట్టు ప్రధాన పేసర్ బుమ్రాపై టీమిండియా మేనేజ్మెంట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. మెగాటోర్నీ ముందున్న నేపథ్యంలో అతనిపై పనిభారం తక్కువ పడేలా చూడనుంది. ముంబయి ఆడే తొలి ఆరు మ్యాచ్‌లకు పేసర్ మలింగ అందుబాటులో ఉండటం లేదు.
వన్డే జట్టు ఓపెనర్ అయిన రోహిత్.. ఐపీఎల్‌లోనూ అదే బాధ్యతను నిర్వర్తించనున్నాడు. బ్యాటింగ్‌లో అలరించేందుకు యువరాజ్, పొలార్డ్, కటింగ్, సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నారు.
బౌలింగ్‌లో బరిందర్, మెక్లెనిగన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్ బౌలింగ్‌ను కృనాల్, జయంత్, మయాంక్ చూసుకోనున్నారు.