తెలంగాణ

telangana

ETV Bharat / briefs

గొడ్డలితో నరికి యువతి దారుణహత్య - women murder

మహిళలకు రోజురోజుకు రక్షణ లేకుండా పోయింది. బయట ఉన్నా.. ఇంట్లో ఉన్నా వారికి భద్రత లేదు. ఇంట్లో నిద్రిస్తున్న ఓ యువతిని గొడ్డలితో అతి దారుణంగా నరికి చంపారు దుండగులు. ఈ విషాద ఘటన నల్గొండ జిల్లాలోని పోలెపల్లిలో చోటుచేసుకుంది.

గొడ్డలితో నరికి యువతి దారుణహత్య

By

Published : Apr 10, 2019, 11:30 AM IST

Updated : Apr 10, 2019, 12:35 PM IST

మహిళలను స్వేచ్ఛగా బతకనివ్వడం లేదు సమాజం. ఇంట్లో ఉన్నా... వారికి భద్రత లేదు. మహిళలు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే స్వాతంత్ర్యం వచ్చినట్లు అని మహాత్మాగాంధీ అన్నారు. ప్రస్తుతం స్వేచ్ఛగా ఇంట్లోనే ఉండే పరిస్థితి లేదు. నల్గొండ జిల్లా చందంపేట మండలం పోలెపల్లిలో ఇంట్లో ఉన్న ఓ యువతిని గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశారు.

గొడ్డలితో నరికి యువతి దారుణహత్య

ఇంటి బయట నిద్రిస్తుండగా హత్య

గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థిని శిరీష.. రాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న వేళ.. హంతకులు గొడ్డలితో ఆమె మెడపై దాడి చేశారు. శిరీష అక్కడిక్కడే మృతిచెందింది.

అసలేం జరిగిందంటే....

శిరీష తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోగా.. హాస్టల్​లో ఉంటూ చదువుతుంది. గత సంవత్సర కాలంగా తన నానమ్మ వద్ద ఉంటూ దేవరకొండలో డిగ్రీ చదువుకుంటుంది. నిన్న అర్ధరాత్రి ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు గొడ్డలితో నరికి చంపారు. ఉదయాన్నే నానమ్మ నిద్రలేచి చూడగా శిరీష విగత జీవిగా పడి ఉంది.

దారుణాన్ని చూసి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అమ్మాయిలకు భద్రత లేదా అని వాపోతున్నారు. ఈ ఘటనతో పోలెపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటన స్థలికి చేరుకున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:అసలైన నాయకులనే ఎన్నుకుంటాం...!

Last Updated : Apr 10, 2019, 12:35 PM IST

ABOUT THE AUTHOR

...view details