తెలంగాణ

telangana

ETV Bharat / briefs

"స్థానిక సంస్థల్లోనూ బీసీలకు అన్యాయమే: భాజపా"

స్థానిక సంస్థల ఎన్నికలపై భాజపా నేతలు గవర్నర్​తో భేటీ అయ్యారు. బీసీలకు మళ్లీ అన్యాయం చేస్తున్నారని ఈ విధమైన చర్యలను అడ్డుకోవాలని నరసింహన్​ దృష్టికి తీసుకువచ్చారు.

స్థానిక సంస్థల్లోనూ బీసీలకు అన్యాయం చేస్తున్నారు'

By

Published : Apr 16, 2019, 12:10 AM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రాన్ని యూనిట్​గా తీసుకోకపోవడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్​ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై భాజపా నేతలు ఇవాళ గవర్నర్​తో భేటీ అయ్యారు. ఎన్నికలు వాయిదా వేయాలని కోరారు. జూలై 4 వరకు స్థానిక సంస్థల పదవీకాలం ఉన్నప్పటికీ ఎందుకు ముందస్తుగా నిర్వహిస్తున్నారో తెలపాలని కోరారు. లోక్​సభ ఎన్నికల తర్వాత ఫలితాలు భిన్నంగా వస్తాయనే భయంతోనే ఇంత ఆదరబాదరగా నిర్వహిస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ విమర్శించారు. బీసీలకు పాత రిజర్వేషన్ విధానాన్నే అమలుచేయాలని కిషన్​రెడ్డి డిమాండ్​ చేశారు.

స్థానిక సంస్థల్లోనూ బీసీలకు అన్యాయం చేస్తున్నారు'
ఇవీ చూడండి: 'స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ తొందరపాటు చర్య'

ABOUT THE AUTHOR

...view details