పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో దిల్లీలో అఖిల పక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ హాజరయ్యారు. తెరాస తరఫున పార్లమెంటరీ పార్టీ నేత కేకే పాల్గొన్నారు. సభను హుందాగా నడిపేందుకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని కేకే సూచించారు. పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న విభజన సమస్యలు, మహిళా రిజర్వేషన్లుపై సభలో లేవనెత్తుతామన్నారు.
'విభజన సమస్యలు, మహిళా రిజర్వేషన్లను ప్రస్తావిస్తాం' - trs in parlimant
సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో దిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. తెరాస తరఫున కేకే హాజరయ్యారు. విభజన సమస్యలు, మహిళా రిజర్వేషన్లు వంటి పెండింగ్ అంశాలను సభలో చర్చిస్తామన్నారు.
'విభజన సమస్యలు, మహిళా రిజర్వేషన్లను ప్రస్తావిస్తాం'