ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన - voter rally
మరో రెండు రోజుల్లో ఓట్ల పండుగ రానుంది. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ.. ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన
పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సూచించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లోని ప్రతాప్ సింగారం గ్రామంలో ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. గ్రామంలో విద్యార్థులంతా ర్యాలీగా వెళ్లి.. ఓటు వినియోగంపై అవగాహన కల్పించారు. ఓటు మన భవిష్యత్తును మారుస్తుందని ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా వినియోగించుకోవాలని కోరారు.
TAGGED:
voter rally