జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఈవీఎం, వీవీప్యాట్స్పై అవగాహన కల్పించే ర్యాలీని జిల్లా సంయుక్త పాలనాధికారి నిరంజన్ జెండా ఊపి ప్రారంభించారు. లోక్సభ ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కును అందరు బాధ్యతగా వినియోగించుకోవాలని సూచించారు. కృష్ణవేణి చౌక్ నుంచి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు.
గద్వాలలో ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ - election
గద్వాల జిల్లా కేంద్రంలో ఓటు హక్కుపై అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించారు.
ఓటు హక్కుపై అవగాహన ర్యాలీ