తెలంగాణ

telangana

ETV Bharat / briefs

టర్కీలో షూటింగ్​... హీరో విశాల్​కు గాయాలు

సుందర్.సి తెరకెక్కిస్తున్న ఓ సినిమా షూటింగ్​లో హీరో విశాల్​కు గాయాలయ్యాయి. పేరు ఖరారు కాని ఈ చిత్రంలో తమన్నా, ఐశ్వర్యా రాజేశ్.. హీరోయిన్లుగా నటిస్తున్నారు.

By

Published : Mar 28, 2019, 1:02 PM IST

షూటింగ్​లో హీరో విశాల్​కు గాయాలు

తమిళ హీరో విశాల్​కు గాయాలయ్యాయి. సుందర్. సి దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా ప్రస్తుతం టర్కీలో షూటింగ్ జరుపుకుంటోంది. యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.

చేతులకు కాళ్లకు బ్యాండేజిలతో హీరో విశాల్

టర్కీలో సుమారు 50 రోజుల షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది చిత్రబృందం. ఇది చివరి వారం. ముఖ్యమైన సీన్లు చిత్రీకరిస్తున్న సమయంలో ఇలా జరిగింది. పేరు ఖరారు కాని ఈ సినిమాలో తమన్నా, ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్లు.

'టెంపర్​' రీమేక్​లోనూ విశాల్ నటించాడు. ఈ సినిమా ఏప్రిల్ 19న థియేటర్లలోకి రానుంది. రాశీ ఖన్నా హీరోయిన్​.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details