ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ శుభ పరిణామం' - ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

గవర్నర్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కలయిక సంతోషకరమని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. పాలనా సౌలభ్యం, అభివృద్ధి కోసం విడిపోయినా... తెలుగు ప్రజలంతా కలిసి ఉండాలి ఆయన ఆకాక్షించారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
author img

By

Published : Jun 2, 2019, 12:11 PM IST

గవర్నర్ సమక్షంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చర్చించుకోవటం వాంఛనీయ పరిణామమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు సోదరభావంతో మెలగటం ఇరువురికీ లాభదాయకమని చెప్పారు. ఏయూ వైవీఎస్‌మూర్తి ఆడిటోరియంలో ఇండస్ట్రీ అకాడమీ ఇంటరాక్షన్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కేంద్రం జోక్యం అవసరం లేకుండా ఇరురాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకో గలిగితే ఎంతో మంచిదన్నారు. గడిచిన ఐదేళ్లలో తాను అదే ఆకాంక్షను వ్యక్తం చేశానని తెలిపారు. కారణం ఏదైనా అది కార్యరూపం దాల్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌, కేసీఆర్‌ చర్చల ద్వారా వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నించడం అభినందించాల్సిన విషయమని పేర్కొన్నారు. ఇంకా కొలిక్కిరాని అంశాలను సత్వరం పరిష్కరించుకోవాలి సూచించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details