జమ్ముకశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించింది ఐక్యరాజ్యసమితి(ఐరాస). మృతుల కుటుంబాలకు తమ సంతాపం ప్రకటించారు ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ దాడి వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టి, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని వెల్లడించారు.
'దోషులకు కఠిన శిక్ష పడాలి'-ఐరాస - జమ్ము ఉగ్ర దాడి
పుల్వామా ఉగ్రదాడిపై ఐక్యరాజ్యసమితి స్పందించింది. తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించింది.
'దోషులకు కఠిన శిక్ష పడాలి'-ఐరాస
''ఇది భారతదేశానికి తగిలిన అతిపెద్ద గాయంగా భావిస్తున్నాం. భారత ప్రభుత్వం, దేశ ప్రజలు త్వరగా ఈ బాధ నుంచి తేరుకోవాలి. ఈ దురాగతానికి పాల్పడ్డ వారికి కఠిన శిక్ష పడాలి''
- ఐరాస ప్రకటన