తెలంగాణ

telangana

ETV Bharat / briefs

మ్యూలర్​ నివేదికంతా బయటపెట్టండి:డెమొక్రాట్లు

2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా పాత్రపై రాబర్ట్​ మ్యూలర్ నివేదికను బయటపెట్టాలని ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ డిమాండ్ చేసింది. నివేదిక సారాంశాన్ని మాత్రమే అటార్నీ జనరల్ విడుదల చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

పూర్తి నివేదికను బయటపెట్టాలని డెమొక్రాట్ల డిమాండ్

By

Published : Mar 25, 2019, 12:22 PM IST

Updated : Mar 25, 2019, 12:50 PM IST

పూర్తి నివేదికను బయటపెట్టాలని డెమొక్రాట్ల డిమాండ్
రాబర్ట్​ మ్యూలర్ నివేదికను సత్వరమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు అమెరికా ప్రతిపక్ష డెమొక్రాటిక్ పార్టీ సభ్యులు. మ్యూలర్ నేతృత్వంలోని కమిటీ 2016 నాటి అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై నివేదిక తయారు చేసింది. అటార్నీ జనరల్ బిల్​ బార్​ నివేదిక సారాంశాన్ని మాత్రమే బయటపెట్టారు. పూర్తిస్థాయిలో నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు డెమొక్రాటిక్ సభ్యులు.

"అధ్యక్షుడిని నిర్దోషిగా ప్రత్యేక దర్యాప్తు అధికారి రాబర్ట్ మ్యూలర్​ నివేదిక పేర్కొనలేదు. పూర్తి నివేదికను వెంటనే మీడియాకు విడుదల చేయాలి." -డెమొక్రాటిక్ పార్టీ ప్రకటన

నివేదిక ఆధారంగా ట్రంప్​ ప్రచారంలో పాల్గొన్న వారెవరూ రష్యాతో సంబంధాలు పెట్టుకోలేదని బార్ వెల్లడించారు. మ్యూలర్ కమిటీలో పరిశీలకుడిగా నియమితులైన అటార్నీ జనరల్ బార్​ నిష్పక్షపాతంగా లేరని అభిప్రాయపడ్డారు డెమెక్రటిక్ నేతలు. ఈ కారణంగానే అటార్నీ జనరల్ విడుదల చేసిన నివేదిక సారాంశాన్ని నమ్మలేమని పేర్కొన్నారు.

2020 ఎన్నికల్లో మ్యూలర్​ నివేదిక డెమొక్రాట్లకు ఆయుధంగా మారుతుందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి:'ఎందుకు పోటీ చేయట్లేదో అడ్వాణీయే చెప్పాలి'

Last Updated : Mar 25, 2019, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details