తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'నూటికి నూరు శాతం పార్టీ మారతా'

తెలంగాణలో కాంగ్రెస్​ నాయకత్వ లోపం వల్లే రెండోసారి ఓటమి చవిచూడాల్సి వచ్చిందని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి అన్నారు. తాను నూటికి నూరు శాతం పార్టీ మారుతానని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో తెరాసకు భాజపాయే ప్రత్యామ్నాయమని పునరుద్ఘాటించారు.

కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

By

Published : Jun 25, 2019, 7:35 PM IST

నూటికి నూరు శాతం తాను పార్టీ మారడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి అన్నారు. అయితే కార్యకర్తలు, నేతలతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటానని దిల్లీలో తెలిపారు. కాంగ్రెస్​లో ఉండి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని తెలిపారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే సత్తా భాజపాకే ఉందని పునరుద్ఘాటించారు. భాజపా నుంచి తనకు ఆహ్వానం అందిందని చెప్పారు. రాష్ట్రంలో హస్తం పార్టీ విధానాల వల్లే రెండోసారి అధికారం కోల్పోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందని వెల్లడించిన ఆయన... ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తానని అన్నారు.

పార్టీ మార్పుపై స్పష్టతనిచ్చిన కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details