తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సీఎల్పీ విలీనం... ఎంఐఎం ప్రతిపక్షం:ఉత్తమ్ - congress leaders meet governer

ముఖ్యమంత్రి కేసీఆర్​ సీఎల్పీని విలీనం చేసి ఎంఐఎంను ప్రతిపక్షం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలని గవర్నర్​ను కలిసి అఖిల పక్ష నేతలు వినతిపత్రం సమర్పించారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి

By

Published : Apr 25, 2019, 7:36 PM IST

పార్టీ అధ్యక్షుడు లేకుండా సీఎల్పీని ఎలా విలీనం చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రజాస్వామికంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్​ తీసుకునేందుకు సభాపతి ఎందుకు ముందుకు రావడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. సీఎల్పీని విలీనం చేసి ఎంఐఎంను ప్రతిపక్షంగా చూపేందుకు కేసీఆర్​ యోచిస్తున్నారని తెలిపారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details