తల్లీబిడ్డలకు తృటిలో తప్పిన ప్రమాదం - కర్ణాటక
కర్ణాటకలోని మంగళూరులో ఓ వాహనం ఢీ కొన్న ప్రమాదంలో తల్లీబిడ్డలు సురక్షితంగా బయటపడ్డారు.
తృటిలో తప్పిన ప్రమాదం
అతివేగంగా వస్తున్న వాహనం వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న తల్లీ బిడ్డలను ఢీకొట్టింది. లిప్తపాటులో జరిగిన ఈ ఘటనతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఆశ్చర్యకరంగా బాధిత మహిళ స్వల్పగాయాలతో బయటపడ్డారు. పసిపాప పక్కకు పడిపోవడం వల్ల ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన స్థానికులు జీపు డ్రైవర్‌కు దేహశుద్ధిచేశారు.