వేసవి సెలవుల్లో తిరుమల వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా దర్శనం కల్పించేందుకు తితిదే కృషిచేస్తోందని జేఈవో లక్ష్మీకాంతం తెలిపారు. అధికారులతో కలసి శుక్రవారం తిరుమల కొండపై విసృత తనిఖీలు చేపట్టారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1,2లోని అన్ని కంపార్ట్మెంట్లను పరిశీలించారు. అక్కడ వేచి ఉన్న భక్తులతో మాట్లాడి వారికి అందుతున్న వసతుల గురించి తెలుసుకున్నారు. వైకుంఠంలోని వంటశాలలో వినియోగిస్తున్న వస్తువుల నాణ్యతను ఆరోగ్య విభాగం అధికారులతో కలసి పరిశీలించారు. అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో వారంరోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులకు దర్శనం కల్పించినట్లు వివరించారు. ఆరు రోజుల్లో 5.1 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించారు.
తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం - భక్తులు
తిరుమలకు భక్తులు పోటెత్తారు. వారం రోజుల్లో రికార్డు స్థాయిలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఒకేసారి లక్షల్లో భక్తులు తరలిరావడం వల్ల శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో కోలాహలం నెలకొంది.
తిరుమలలో రికార్డు స్థాయిలో శ్రీవారి దర్శనం