యాదాద్రిలోని పాతగుట్ట వద్ద పోలీసు వాహనం ఢీకొని దిల్సుఖ్నగర్కు చెందిన మూడేళ్ల ప్రణతి గాయపడింది. శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దర్శనం కోసం హైదరాబాద్ నుంచి ఓ కుటుంబం వచ్చింది. దైవదర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలోని చాలువ పందిరి కింద కుటుంబ సభ్యులు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎన్నికల విధుల కోసం వచ్చిన పోలీసులూ..దైవదర్శనం కోసం గుడికి వచ్చారు. వాహనం నిలుపుతున్న క్రమంలో వెనుక ఉన్న ప్రణతికి తగిలి గాయాలయ్యాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వైద్యం కోసం హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మూడేళ్ల పాపను ఢీకొట్టిన పోలీస్ వాహనం - vehicle
యాదాద్రి పాత శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం వద్ద పోలీస్ వాహనం తగిలి ఓ బాలికకు గాయాలయ్యాయి. వైద్యం కోసం పాపను హైదరాబాద్కు తరలించారు.
పాపను ఢీకొట్టిన పోలీస్ వాహనం