1905లో అప్పటి 6వ నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీఖాన్ హయాంలో ప్రస్తుత అసెంబ్లీ భవనం ప్రారంభమైనప్పటికీ.. 1913లో 7వ నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హయాంలో ఇది పూర్తయింది. 1952లో హైదరాబాద్ రాష్ట్రం ఏర్పడినప్పుడు జరిగిన మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాల కోసం ఈ టౌన్ హాలును హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీగా మార్చేశారు. దీనిని చారిత్రక భవనంగా మార్చి.. ఎర్రమంజిల్లో కొత్త అసెంబ్లీ, మండలి నిర్మాణాల కోసం సీఎం కేసీఆర్ భూమి పూజ చేయనున్నారు. ఎన్నో ప్రభుత్వాలు శాసనాలు చేసిన ప్రస్తుత అసెంబ్లీ విశేషాలను ఈటీవీ భారత్ ప్రతినిధి శ్రీనివాస్ మరిన్ని వివరాలు అందిస్తారు.
ప్రస్తుత అసెంబ్లీ చరిత్ర ఎంతో ఘనం! - mandali
నూతన శాసనసభ, శాసనమండలి భవనాలను ఎర్రమంజిల్లో నిర్మించేందుకు ప్రభుత్వం రూ.100కోట్లు కేటాయించింది. ఈనెల 27న ఎర్రమంజిల్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీ, మండలి భవనాల కోసం భూమి పూజ చేయనున్నారు.
చరిత్ర ఎంతో ఘనం!