ఓ దంపతులు అనాథ వృద్ధులకు ఆశ్రయం కల్పించి ఆదరిస్తే... వారి కుమారుడు వసతిగృహంలో తనువు చాలించిన వృద్ధులకు తల కొరివి పెట్టి మానవత్వాన్ని బతికిస్తున్నాడు. కన్న బిడ్డలు కాదనుకున్న తల్లిదండ్రులకు ఆ యువకుడు దేవుడిచ్చిన బిడ్డలా.. కర్మకాండ నిర్వహిస్తున్నాడు.
తల్లిదండ్రుల బాటలో...
హన్మకొండలో సహృదయ అనాథ వృద్ధాశ్రమం ద్వారా చోటే మియా, యాకూబ్ బి ముస్లిం దంపతులు ఎంతోమందికి ఆశ్రయం కల్పిస్తున్నారు. కన్న బిడ్డలు కాదని బజారున పడేసిన వృద్ధులకు కుమార్తె ప్రేమను, కుమారుడి ఆప్యాయతను పంచుతున్నారు. వీరి నీడలో తనువు చాలించిన వారికి ముస్లిం దంపతులే కర్మకాండ నిర్వహించి మానవత్వాన్ని చాటుతున్నారు. తల్లిదండ్రుల సేవా భావాన్ని చూసి చలించిపోయిన వీరి కుమారుడు హకీం పర్వేజ్ వారి ఆశయాలను పంచుకునేందుకు ముందుకు వచ్చాడు.