రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని... శివాలయం, మార్కండేయ దేవాలయం తదితర దేవాలయాల్లో శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో కుంకుమ పూజ, అభిషేకాలు, హోమం తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను తిలకించారు.
వాడవాడలా నవమి వేడుకలు - ramuni kalyanam
రాజన్న సిరిసిల్ల జిల్లాలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కల్యాణం వాడవాడలా కన్నుల పండువగా సాగింది.
సిరిసిల్లలో రాముని కల్యాణం