రోజురోజుకు పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న ఓ కుటుంబం తమ ఇంట్లో జరిగే వివాహానికి వచ్చే అతిథులకు ఇబ్బంది లేకుండా చేయాలని భావించింది. వచ్చిన ఆలోచనను కుటుంబసభ్యులు అమలులో పెట్టారు. అథితులకు చిరునామా వెతుక్కునే ఇబ్బందులు లేకుండా చేశారు.
పెళ్లికార్డుకు సాంకేతిక హంగులు - క్యూఆర్ కోడ్ యాప్
మీరు పెళ్లికి వెళ్లాలనుకుంటున్నారా? చిరునామా గురించి బెంగ అక్కర్లేదు. వివాహానికి వచ్చే అతిథులకు.. కొత్త ప్రదేశంలో శుభకార్యం ఎక్కడ జరుగుతుందో సరిగ్గా తెలియదు. వివాహ సమయానికి చేరుకుంటామో లేదోనన్న అనుమానం ఇవన్నీ వెంటాడుతుండేది. కానీ వీటన్నింటికి సాంకేతిక పరిజ్ఞానంతో చెక్ పెట్టింది ఓ కుటుంబం.
ఈనెల 23న ప్రకాశం జిల్లాకు చెందిన శ్రావణి, పాలూరి శ్రీనివాస్‌కు వివాహం జరగనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే బంధుమిత్రులకు చిరునామా తెలపడానికి శ్రావణి కుటుంబ సభ్యులు సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించారు. పెళ్లిపత్రికలపై క్విక్ రెస్పాన్స్ క్యూర్ కోడ్‌ను ముద్రించి బంధువులకు పంచారు. ఇందులో భాగంగా శ్రావణి మిత్రురాలు వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన కావ్యశ్రీకి వివాహ పత్రికను పంపించారు. ఆండ్రాయిడ్ సెల్లో క్యూఆర్ కోడ్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని పత్రికపై చూపి స్కాన్ చేస్తే నేరుగా వివాహం జరిగే చిరునామాను చూపిస్తుంది. ఇలా సరికొత్తగా ముద్రించిన పెళ్లికార్డులు చూసి వరంగల్‌వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చూడండి: అమ్మ ప్రేమను అందరూ గౌరవించాల్సిందే