తెలంగాణ

telangana

ETV Bharat / briefs

కేసీఆర్ హామీ ఇచ్చి... ఇప్పుడు మరిచారు - kcr

గతేడాది మే 16న ముఖ్యమంత్రి సమావేశం పెట్టి... ఐఆర్, పీఆర్​సీ ఇస్తామని హామీ ఇచ్చారని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ నేతలు తెలిపారు. భాషా పండితుల అప్​గ్రేడ్, టీఆర్​టీ నియామకాల వంటి అంశాలు ఇప్పటికీ పెండింగ్​లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధ్యాయలకు సమస్యలే లేవని కేసీఆర్ వ్యాఖ్యానించడం సమంజసంగా లేదన్నారు.

teachers-union

By

Published : Apr 16, 2019, 11:58 PM IST

విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం పాఠశాలల పునప్రారంభం తర్వాత దశల వారీగా ఉద్యమం చేపట్టనున్నట్లు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ పేర్కొంది. ఈనెల 20 నుంచి పదోతరగతి మూల్యాంకన కేంద్రాల వద్ద భోజన విరామ సమయంలో నిరసనలు తెలపనున్నట్లు వెల్లడించింది. మధ్యంతర భృతి, వేతన సవరణ చేస్తామని ఏడాది క్రితం చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూడాలనడం విడ్డూరంగా ఉందని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు.

కేసీఆర్ హామీ ఇచ్చి... ఇప్పుడు మరిచారు
ఇదీ చూడండి: 'మద్దతు ధరకు వ్యూహం రూపొందించండి'

ABOUT THE AUTHOR

...view details