తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'పరాశక్తితో పరుగు అంత సులువు కాదు' - దిల్లీ క్యాపిటల్స్‌

ఇమ్రాన్​ తాహీర్​ వికెట్లు తీసిన ఆనందంలో మైదానంలో పరుగెత్తుకుని రౌండులు వేస్తాడు. ఆ సమయంలో అతడితో పరుగెత్తడం చాలా కష్టమని ధోనీ చెప్పాడు.

'పరాశక్తితో పరుగు అంత సులవు కాదు'

By

Published : May 2, 2019, 3:56 PM IST

Updated : May 3, 2019, 6:59 AM IST

చెన్నై సూపర్​కింగ్స్​లో పరాశక్తి ఎక్స్​ప్రెస్​గా పిలుచుకునే​ 39 ఏళ్ల తాహీర్​తో పరుగెత్తడం అంత సులభం కాదట. ఈ విషయం రన్నింగ్​లో అమేజింగ్​గా చెప్పుకొనే ధోనీ చెప్పడం విశేషం.

'ఇమ్రాన్‌ తాహీర్‌ వికెట్‌ తీసినప్పుడు అతను సంబరాలు చేసుకునే తీరు చూసి జట్టు సభ్యులంతా ఎంజాయ్‌ చేస్తాం. నేను, వాట్సన్​... తాహీర్‌తో పాటు పరుగు తీసి అతని వద్దకు వెళ్లలేం. అందుకే దగ్గరకు వచ్చినపుడే అభినందిస్తాం. సంబరాలు పూర్తవ్వగానే ఎవరి స్థానాల్లోకి వారు వెళ్లిపోవాలని ముందే చెప్పుకున్నాం. తాహీర్‌ కూడా వెంటనే బౌలింగ్‌ చేసేందుకు సిద్ధమవుతాడు'.
-- మహేంద్ర సింగ్​ ధోనీ, చెన్నై సూపర్​కింగ్స్​

బుధవారం దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తాహీర్‌ కేవలం 12 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు.
ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరుకున్న ధోనీ సేన... తాజా విజయంతో పాయింట్ల పట్టికలో టాపర్‌గా నిలిచింది. తర్వాతి మ్యాచ్‌ కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో ఆడనుంది చెన్నై. ఆ మ్యాచ్‌లోనూ గెలిస్తే ఫైనల్‌ చేరుకునేందుకు రెండు అవకాశాలు వస్తాయి.

Last Updated : May 3, 2019, 6:59 AM IST

ABOUT THE AUTHOR

...view details