ఉద్యమకారుడు, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కష్టపడే కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌ను ప్రజలు మరోసారి గెలిపించాలని తెరాస రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ కోరారు. కరీంనగర్‌లో నిర్వహించిన సమావేశంలో తెరాస ప్రభుత్వం బలహీన వర్గాల కోసం అమలు చేస్తున్న పథకాలను ఆయన వివరించారు.
వినోద్‌కుమార్‌ను గెలిపించాలి - trs
ప్రజాసంక్షేమం కోసం పరితపించే కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్‌ను ప్రజలు మరోసారి గెలిపించాలని రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ కోరారు.
రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్
ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన వినోద్‌కుమార్ ప్రస్తుతం రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాల రూపకల్పనలోను ఎన్నో సలహాలు సూచనలు చేశారని పేర్కొన్నారు. రాబోయే మూడు రోజుల పాటు గ్రామాల్లో పాదయాత్రలు నిర్వహించి ఈనెల 17న కరీంనగర్‌లో జరగనున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని బండ ప్రకాశ్ సూచించారు.
ఇవీ చూడండి:అయితే భోఫోర్స్ లేకుంటే రఫేలా?