తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సన్​రైజర్స్ చేతిలో ఛాలెంజర్స్​కు భంగపాటు - BAIRSTOW CENTURY IN IPL 2019

సొంతగడ్డపై జరిగిన పోరులో సన్​రైజర్స్ హైదరాబాద్ 118 పరుగుల తేడాతో బెంగళూరుపై ఘన విజయం సాధించింది. బ్యాటింగ్​లో రైజర్స్ ఓపెనర్లు సెంచరీలతో మెరవగా, బౌలింగ్​లో అఫ్గాన్ బౌలర్ నబీ 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.

గెలుపు సంబరంలో సన్​రైజర్స్ హైదరాబాద్

By

Published : Mar 31, 2019, 8:02 PM IST

హైదరాబాద్​లో జరిగిన ఐపీఎల్​ మ్యాచ్​లో ఆతిథ్య జట్టు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక బెంగళూరు చతికిలపడింది. 232 పరుగుల టార్గెట్​తో బరిలోకి దిగి కేవలం 113 పరుగులకే ఆలౌట్ అయింది. ఆర్​సీబీ జట్టులో గ్రాండ్​హోమ్ (37) మినహా ఎవరూ రాణించలేకపోయారు. సెంచరీతో రాణించిన సన్​రైజర్స్​ ఓపెనర్​ బెయిర్​స్టోకు మ్యాన్​ ఆఫ్​ ది మ్యాచ్​ అవార్డు లభించింది.

వేసవిలో 'సన్​రైజర్స్' పరుగుల వర్షం

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన హైదరాబాద్ జట్టుకు ఓపెనర్లు 'వార్నర్-బెయిర్ స్టో' లు అదిరే ఆరంభాన్నిచ్చారు. ఐపీఎల్​ చరిత్రలోనే అత్యధికంగా 185 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

సెంచరీలతో చెలరేగిన వేళ..

సన్​రైజర్స్ ఓపెనర్లిద్దరూ ఈ మ్యాచ్​లో సెంచరీలు నమోదు చేశారు. ముఖ్యంగా తొలి ఐపీఎల్ సీజన్​ ఆడుతున్న బెయిర్ స్టో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 56 బంతుల్లో 114 పరుగులు చేసి చాహల్ బౌలింగ్​లో ఔటయ్యాడు.

మరో ఓపెనర్ వార్నర్.. నిషేధంతో ఏడాది పాటు ఆటకు దూరమైనా... తన బ్యాట్ పవర్ తగ్గలేదని నిరూపించాడు. ఇన్నింగ్స్ చివరి వరకూ నిలిచి 100 పరుగులతో నాటౌట్​గా నిలిచాడు.​

బెంగళూరు బౌలర్లలో చాహల్ మినహా మరెవరూ వికెట్లు తీయలేకపోయారు.


బెంగళూరు జట్టేనా ఇది...

ఈ సీజన్​లోనైనా రాణిస్తుందనుకున్న బెంగళూరు పరిస్థితి మరీ ఘోరం. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచ్​ల్లోనూ ఓటమి పాలైంది. 232 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కనీస పోటీ ఇవ్వలేకపోయింది. గ్రాండ్​హోమ్ (37 పరుగులు) మినహా అందరూ విఫలమయ్యారు.

పార్థివ్ 11, హిట్మైర్​ 9, కోహ్లీ 3, డివిలియర్స్ 1, మొయిన్​ అలీ 2 పరుగులు చేసి వెనుదిరిగారు.

  • రైజర్స్ బౌలర్ సందీప్ శర్మ చేతిలో విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఆరు సార్లు ఔటయ్యాడు.

సన్​రైజర్స్ బౌలర్లలో నబీ అత్యుత్తమంగా 11 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. సందీప్ శర్మ 3 వికెట్లు తీసి రైజర్స్ విజయంలో తమ వంతు పాత్ర పోషించారు.

ABOUT THE AUTHOR

...view details