ఝార్ఖండ్ లోహర్దాగాలో సర్వసతి పూజ సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకొంది. పూజానంతరం ప్రసాదం తిని 50 మంది పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరందరూ 6-7 సంవత్సరాల్లోపు పిల్లలే.
సర్వసతి పూజలో అపశ్రుతి - పుడ్ పాయిజన్
ప్రసాదం తిని 50 మంది పాఠశాల విద్యార్థులకు అస్వస్థత.
సరస్వతి పూజలో వికటించిన ప్రసాదం
వైద్యుడు కుమార్ తెలిపిన వివరాలు ప్రకారం ప్రసాదం తిన్న వెంటనే విద్యార్థులు వాంతులు చేసుకోవడం ప్రారంభించారు. ప్రసాదంగా బూందీని పంచారు. ప్రస్తుతం వీరు ప్రమాదం నుంచి బయటపడ్డారని వైద్యులు తెలిపారు.